ఓయూలో ఇంటర్ విద్యార్థులకు స్పెషల్ కోర్సు

ouఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక బ్రిడ్జి కోర్సు తరగతులను ప్రారంభించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ జె. సావిత్రి తెలిపారు. ఎ బ్రిడ్జి కోర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్‌గా పిలువబడే ఈ కోర్సుకు ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. ఒక నెల కాలవ్యవధి గల ఈ కోర్సుకు ఉదయం, సాయంత్రం వేర్వేరుగా తరగతులను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా డాక్టర్ బీవీ పట్టాభిరామ్, డాక్టర్ వి. నగేశ్, వై. మల్లికార్జున్‌రావు వంటి నిపుణులచే ప్రత్యేక తరగతులు కూడా నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కోర్సు రుసుమును రూ.2,500గా నిర్ణయించినట్లు చెప్పారు. ఇతర వివరాలకు 9652856107, 040-64575575, 27682354 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Posted in Uncategorized

Latest Updates