ఓయూ డిస్టెన్స్ కోర్సులు : నోటిఫికేషన్ విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (PGRRCDE)  2018-19 విద్యాసంవత్సరానికి వివిధ పీజీ కోర్సులు, డిగ్రీ కోర్సులతోపాటు పీజీ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు అడ్మిషన్ నోటిఫికేషన విడుదల చేసింది.  ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులతోపాటు పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ సందర్భంగా మాట్లాడిన వీసీ..దూరవిద్య ద్వారా వివిధ కోర్సులు చదివే విద్యార్థుల సంఖ్య దేశంలోనే కాకుండా అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పెరుగుతోందని చెప్పారు.  యూపీఈ ర్యాంకుతోపాటు న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ సాధించిన ఓయూ నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు చెప్పారు. మారుతున్న కాలానుగుణంగా పరిశ్రమలు, సంస్థల అవసరాల మేరకు కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ-లెర్నింగ్ మెటీరియల్, ఈ-కంటెంట్, ఆన్‌ లైన్ ఎవాల్యుయేషన్ విద్యావ్యవస్థలో ప్రవేశించాయని వివరించారు. ఓయూలో అన్ని విభాగాల్లో డిజిటల్ పద్ధతిన లావాదేవీలు నిర్వహిస్తామని తెలిపారు.

పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.oucde.net/ చూడవచ్చు

Posted in Uncategorized

Latest Updates