ఓరి దేవుడా.. మళ్లీ ఏమైంది : బలహీనంగా మారిన రుతుపవనాలు

hyderabad weatherఅనుకున్న టైం కంటే ముందే నైరుతి రాష్ట్రంలోకి వచ్చింది. చల్లటి కబురుతోపాటు చలిగాలులు కూడా ఇచ్చింది. ఇక ఎండలు పోయాయి.. వానాకాలం వచ్చేసింది అనుకున్నారు అంతా. అందుకు తగ్గట్టుగానే మూడు, నాలుగు రోజులు వర్షాలు కూడా పడ్డాయి. ఏమైందో ఏమో.. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎండలు పెరుగుతున్నాయి. ఉక్కబోత మొదలవుతోంది. వర్షాల జాడ కనిపించటం లేదు. సాయంత్రం అయినా చినుకు రాలటం లేదు. శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. హైదరాబాద్, ఖమ్మం, మెదక్ లో సాధారణం కంటే నాలుగు డిగ్రీల అధికంగా 38 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది. ఇక ఆదిలాబాద్, నల్గొండ, భద్రాచలం, రామగుండంలో గరిష్ఠం 39 డిగ్రీలుగా ఉంది.

పొడి వాతావరణ, ఉష్ణోగ్రత పెరగటానికి కారణం రుతుపవనాలు బలహీనంగా మారటమే. చురుగ్గా కదలటం లేదు. మరో వారం రోజులు ఇదే విధంగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయినా అక్కడక్కడ చిరు జల్లులు, ఉరుములు, మెరుపులు ఉంటాయని తెలిపారు. ఛత్తీస్ ఘడ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్నాటక వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. అయితే ఇది భూమికి 8 కిలోమీటర్ల ఎత్తులో ఉండటం వల్ల తేలికపాటి వర్షాలు మాత్రమే పడి అవకాశం ఉంటుందని ప్రకటించింది వాతావరణ శాఖ.

Posted in Uncategorized

Latest Updates