ఓరి దేవుడా : వ్యాపారి దంపతులను చంపింది పక్కింటి కుర్రోడే

hasanవరంగల్ జిల్లా హసన్ పర్తిలో వ్యాపార దంపతులు దామోదర్, పద్మలను అత్యంత కిరాతకంగా చంపిన కేసులో మిస్టరీని ఛేదించారు పోలీసులు. వీరిని చంపింది వారి పక్కింటి కుర్రోడు ప్రశాంత్ గా గుర్తించారు. డబ్బు, బంగారం కోసం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు. ప్రశాంత్ నుంచి రూ.4.50లక్షల డబ్బు, 132 గ్రాముల బంగారం, ఓ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలిసి స్థానికులు షాక్ అయ్యారు. రోజూ కళ్లెదుట తిరుగుతున్న అబ్బాయి ఇంత పని చేశాడంటే నమ్మలేకపోతున్నారు. రోజూ మా ముందే తిరుగుతుంటాడని.. హత్యలు చేస్తాడని అనుకోలేదని చుట్టు పక్కల వారు అంటున్నారు.

విలాసాలకు అలవాటుపడిన ప్రశాంత్.. డబ్బు బాగా అవసరం అయ్యింది. కిరాణా షాపు నడుపుకుంటున్న దామోదర్, పద్మ కుటుంబంపై ఇతని కన్ను పడింది. ఇంట్లో వీళ్లిద్దరే ఉండటం, వారి దగ్గర లక్షల్లో డబ్బు ఉంటుందని నిర్థారణకు వచ్చిన తర్వాత ఈ ప్లాన్ వేశాడు. అర్థరాత్రి తర్వాత ఇంట్లోకి ప్రవేశించి ఇద్దరినీ చంపి.. డబ్బు, బంగారంతో పారిపోయాడు. హత్య తర్వాత ప్రశాంత్ కనిపించకుండా పోవటం, అతని ప్రవర్తనపై అనుమానం రావటంతో అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. మిస్టరీ వీడింది.

 

Posted in Uncategorized

Latest Updates