ఓరుగల్లు పై షార్ట్ ఫిల్మ్..

రాష్ర్ట సాంస్కృతిక రాజధాని వరంగల్ పై కేంద్రం షార్ట్ ఫిల్మ్ రూపొందించనుంది. నగరంలోని పర్యాటక స్థలాల విశేషాలు,అక్కడ చేసిన ఏర్పాట్లు,అభివృద్ధి అన్నింటినీ చూపిస్తూ టూరిస్టులను ఆకట్టుకునేలా షార్ట్ ఫిల్మ్ ను సిద్ధం చేయనుంది. జాతీయ వారసత్వ నగరాల(హృదయ్) పథకం కింద చేపట్టిన పనులు. పర్యాటకులకు ఉన్న సౌకర్యాలతో ఈ షార్ట్ ఫిల్మ్ రెడీ అవుతుంది .

వరంగల్ తో పాటు ఏపీలోని అమరావతి,అజ్మీర్,అమృత్ సర్,బాదామి,ద్వారక,గయ,కాంచీపురం,మధుర,పూరీ,వారణాసి,వేలాంకణి నగరాలకు సంబంధించి కూడా వేర్వేరుగా షార్ట్ ఫిల్మ్ లు తీయనుంది. తర్వాత ఈ అన్ని నగరాలకు కలిపి మరో షార్ట్ ఫిలింను రూపొందనుంది. దీని కోసం నేషనల్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ తో ఒప్పందం కుదుర్చుకుంది.  ఈ షార్ట్ ఫిల్మ్ లతో ఆ ప్రాంతాల స్పెషాలిటీ టూరిస్టులకు తెలియడమే కాకుండా వారి సంఖ్య కూడా పెరుగుతుందని అధికారులు చెపుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates