ఓల్డ్ ఈజ్ గోల్డ్ : పాత కారు కోసం GHMCలో IAS అధికారుల పోటీ

ం్చడ
ఎవరికైనా కొత్త వాహనం వచ్చిందంటే పాత వాహనంపై ఇంట్రెస్ట్ తగ్గుతుంది. కానీ బల్ధియా అధికారులకు మాత్రం పాత వెహికల్ కోసమే ఆశ పడుతున్నారు. అది కూడా 12ఏళ్లు దాటిన ఇన్నోవానే కావాలని కోరుతున్నారు. ఆ పాత వాహనం కావాలంటున్నది మామూలు వ్యక్తులు కాదు ఐఎఎస్ అధికారులు.

బల్ధియాలో ఓ పాత ఇన్నోవా కారు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆ ఒక్క కారు తమకే కావాలంటూ దాదాపు పది మంది ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా 12ఏళ్ల నాటి కారును సెంటిమెంట్ గా భావిస్తున్నారు. పాత కారయినా సరే.. బాస్ వాడిన కారే కావాలంటున్నారు. కమిషనర్ జనార్ధన్ రెడ్డి పాత వాహనం ఏపీ 12జీ 0945పై అడిషనల్, జోనల్ కమిషనర్లు ఆసక్తి చూపుతున్నారు. తమకు కొత్త వాహనం వద్దు.. పాత వాహనమే ముద్దంటున్నారు.

ఇంతకముందు బల్ధియా కమిషనర్లుగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారులంతా ఇదే ఇన్నోవా వెహికల్ వాడారు. అందుకే దాన్ని సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు బల్ధియాలోని ఐఏఎస్ అధికారులు. కమిషనర్ వాడిన పాత బండి కోసం ఇంట్రెస్ట్ చూపుతున్నవారిలో అడిషనల్ కమిషనర్లు భారతి హోళికేరి, ముషారఫ్ అలీఫారూఖీ, అద్వైత్ కుమార్ సింగ్, సిక్తా పట్నాయక్, రవికిరణ్, రమేష్ ఉన్నారు. ఇక జోనల్ కమిషనర్లు హరిచందన, రఘుప్రసాద్, శంకరయ్య కూడా పాత ఇన్నోవాపైనే మోజు పడుతున్నారు.

ప్రస్తుతానికి జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి పాత ఇన్నోవాని ఎవరికి కేటాయించలేదు. కానీ అడిషనల్ కమిషనర్ ముషారఫ్ అలీ మాత్రం రెండు మూడు రోజులుగా వాడుతున్నారు. కొత్త వాహనాలు వచ్చాక.. ఈ పాత వాహనాన్ని ఎవరికైనా కేటాయించడమా.. లేక కమిషనర్ ప్రోటోకాల్ వాహనంగా మార్చాలా… అని ఆలోచిస్తున్నారు  బల్ధియా ట్రాన్స్ ఫోర్ట్ అధికారులు.జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకొని.. మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్లతో పాటు అడిషనల్, జోనల్ అధికారుల కోసం కొత్త వాహనాలు కొన్నారు. మేయర్ బొంతు రామ్మోహన్ కు ఫార్చునర్ కేటాయిస్తే.. మిగతా వారికోసం కొత్త మోడల్ ఇన్నోవాలు వచ్చేశాయి. కమిషనర్ జనార్ధన్ రెడ్డితో పాటు ఇతర ఐఏఎస్ అధికారులు, అడిషనల్, జోనల్ కమిషనర్లు, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులకి కూడా న్యూ వెహికల్స్ కేటాయిస్తారు. అందుకే ఇప్పుడు బల్ధియా బాస్ పాత కారు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఐఏఎస్ అధికారులు.

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates