ఓవర్ నైట్ స్టార్: ట్విట్టర్ లో స్పందించిన ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

priyaనిన్నటి వరకు ఎవరికీ పెద్దగా తెలియని ఆమె పేరు ఈ రోజు  దేశం మొత్తం మార్మోగుతుంది. ఓవర్‌నైట్‌లోనే సోషల్ మీడియా తనను సూపర్‌స్టార్‌ను చేసేయడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ అమ్మాయే మలయాళం హీరోయిన్‌ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. అనూహ్యంగా పాపులారిటీ దక్కడంతో ఆమె హర్షం వ్యక్తం చేసింది. తనపై చూపించిన అభిమానానికి పొంగిపోతోంది. తన ఆనందాన్నిట్విటర్‌లో నెటిజన్లతో పంచుకుంది ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. సోషల్‌ మీడియాలో తాను జాతీయస్థాయిలో స్టార్‌గా మారడాన్ని నమ్మకలేపోతున్నానని ప్రియా ప్రకాశ్‌ ట్వీట్‌ చేసింది. తనపై చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపింది. ఓరు ఆదార్ లవ్  సినిమాతో వెండితెరకు ఆమె పరిచయమవుతోంది. ఈ సినిమా మార్చి 3న విడుదలకానుంది. ఈ మూవీలో నటిస్తున్నం‍దుకు చాలా సంతోషంగా ఉందని ప్రియ తెలిపింది. ఈ సినిమాలోని మాణిక్య మలారయ పూవి పాటలో కనులతో ప్రియ ప్రదర్శించిన హావభావాలకు అందరూ ఫిదా అయ్యారు. ఇప్పటివరకు ఈ పాటకు యూట్యూబ్‌లో 40 లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరోవైపు ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ను ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరించేవారి సంఖ్య కూడా అమాంతంగా పెరిగిపోయింది.

Posted in Uncategorized

Latest Updates