ఓ టీవీ ఛానల్ ఎడిటర్ పై టాలీవుడ్ పిర్యాదు

telugu-film-industryసినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న నటులు, మహిళలను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారంటూ ఓ తెలుగు టీవీ ఛానెల్‌ ఎడిటర్‌పై టాలీవుడ్‌ ప్రతినిధులు శనివారం(మార్చి-24) పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీనటుడు పోసాని కృష్ణ మురళీతో శనివారం నిర్వహించిన ఓ లైవ్‌ డిబేట్‌లో టాలీవుడ్‌లో పని చేస్తున్న మహిళలను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారని ఫిర్యాదులో తెలిపారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు పేపర్ ను అందజేశారు. ఫిర్యాదు చేస్తున్న సమయంలో టాలీవుడ్‌ నటీనటులు ఝాన్సీ, హేమ, శివాజీ రాజా, బెనర్జీ, ఉత్తేజ్‌ తదితరులు ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates