ఓ పనైపోయింది : టీడీపీ నుంచి మోత్కుపల్లి బహిష్కరణ

mothukupalliతెలంగాణ తెలుగు దేశం పార్టీ నుంచి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులును బహిష్కరించారు. విజయవాడలో జరుగుతున్న టీడీపీ మహానాడులో తెలంగాణ TTDP అధ్యక్షుడు ఎల్.రమణ మోత్కుపల్లిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

గత ఆరు నెలలుగా జరిగిన రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సోమవారం(మే-28) హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్‌ దగ్గర మోత్కుపల్లి ప్రవర్తన కుట్రపూరితంగా.. పార్టీని బలహీనపర్చేదిగా ఉందని ఆరోపించారు. మోత్కుపల్లికి గవర్నర్ పదవి కోసం చంద్రబాబు చొరవ చూపారని..అయితే మోత్కుపల్లి తమిళనాడు గవర్నర్ పదవిని కోరారన్నారు. కేంద్రం తమిళనాడు గవర్నర్ పదవి ఇవ్వలేదని తెలిపారు. మోత్కుపల్లి ఆధారాల్లేని ఆరోపణలతో TTDPని బలహీనపర్చి.. కేసీఆర్‌కు మోకరిల్లాలని చూస్తున్నారన్నారని ఆరోపించారు రమణ. విపరీత ధోరణితోనే మోత్కుపల్లి ఇదంతా చేస్తున్నారన్నారు.

గతేడాది విజయదశమి నుంచి ఇవాళ్టి వరకు ఆయన కార్యక్రమాలన్నీ పార్టీని పూర్తిగా బలహీనపరిచేదిగా ఉందన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టింది సామాజిక న్యాయంకోసం.. అణగారిన వర్గాల కోసమన్న రమణ… దాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి చంద్రబాబన్నారు. ఇంత వరకు ఆయనలో మార్పు రాకపోగా.. టీడీపీని లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్‌ను ఎన్టీఆర్‌తో పోల్చి చెప్పడం ఎంతవరకు సబబో చెప్పాలని మోత్కుపల్లిని డిమాండ్ చేశారు రమణ.

Posted in Uncategorized

Latest Updates