ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కనీస వేతనం రూ.25 వేలు

employeesఔట్‌సోర్సింగ్‌ విధానంలో పని చేస్తున్న ఉద్యోగులకు వన్‌ టైమ్‌ స్కేల్‌ కింద కనీస వేతనం గరిష్టంగా 25 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 53 వేల మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిని రెగ్యులరైజేషన్ కు  అవకాశాలు లేకపోవడం… ఇప్పటికే పలు శాఖల్లో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణను హైకోర్టు అడ్డుకోవడంతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్ స్థాయిలో 32 శాఖలు ఉండగా, కమిషనర్‌, డైరెక్టరేట్‌ స్థాయిలో 141కి పైగా విభాగాలు ఉన్నాయి. శాశ్వత నియామకాలు ఆగిపోవడంతో ఔట్‌సోర్సింగ్‌పై ఆధారపడి చాలా శాఖలు పని చేస్తున్నాయి.

వాస్తవానికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు లేకుంటే కార్యకలాపాలు పూర్తిగా కుంటుపడే పరిస్థితులున్నాయి. ఈ క్రమంలో రెగ్యులర్‌ ఉద్యోగుల కన్నా.. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులే ఎక్కువ పని చేస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం వేతనాల పెంపు ప్రతిపాదనను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆర్థిక శాఖ నుంచి ఈ ఫైలు సీఎం కేసీఆర్‌కు చేరింది. ప్రతిపాదనలకు ఆయన ఆమోదం తెలిపితే… ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్లో మూడు స్థాయిల్లో ఉన్న వారికి వేతనాలు పెరగనున్నాయి.

1.ఆఫీసు సబార్డినేట్—     12,000( ప్రస్తుతం)–  15,000( ప్రతిపాదిత వేతనం)

2.జూనియర్ అసిస్టెంట్ — 15,000(ప్రస్తుతం)–  19,000(ప్రతిపాదిత వేతనం)

  1. సీనియర్ అసిస్టెంట్— 17,000(ప్రస్తుతం)– 25,000(ప్రతిపాదిత వేతనం)
Posted in Uncategorized

Latest Updates