ఔరంగజేబు కుటుంబాన్ని పరామర్శించిన నిర్మలా సీతారామన్

nirmalaఇటీవల ఉగ్రవాదుల చేతుల్లో హత్యకు గురైన సైనికుడు ఔరంగజేబు కుటుంబాన్ని పరామర్శించారు కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్. ఇవాళ ఉదయం జమ్మూ కశ్మీర్‌లో ఔరంగజేబు స్వస్థలమైన పూంఛ్ వెళ్లిన ఆమె అతని ఇంటికి పోయి అమర జవాను కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందనీ, ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులను త్వరలోనే పట్టుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఆమె. నిర్మలా సీతారామన్‌తో పాటు భారత ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసు శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.

కుటుంబంతో కలిసి రంజాన్ జరుపుకునేందుకు స్వస్థలానికి వెళుతున్న ఔరంగజేబును గతవారం ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి దారుణంగా పొట్టబెట్టుకున్నారు. కరడుగట్టిన హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాది సమీర్ టైగర్‌ను మట్టుబెట్టడంలో ఔరంగజేబు కీలక పాత్ర పోషించాడు. అందుకు ప్రతికారంగానే ఈ హత్య జరిగిందని, అలాగే ఈ హత్యవెనుక పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం ఉన్నట్లు భావిస్తున్నాయి నిఘావర్గాలు.

Posted in Uncategorized

Latest Updates