ఔరంగాబాద్ లో హైటెన్షన్

మహారాష్ట్రలో మరోసారి కోటా వివాదం రాజుకుంది. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ కావాలంటూ ఆందోళనలకు దిగారు. ధర్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో ఔరంగాబాద్ లోని నది వంతెనపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఓ ఆందోళనకారుడు నదిలోకి దూకేశాడు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువకుడి ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఔరంగాబాద్ ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు.

వాహనాలకు నిప్పులు పెట్టారు. దుకాణాలు మూయించారు. ప్రభుత్వ వైఖరి వల్లే ఆందోళనలు చెలరేగుతున్నాయంటూ విమర్శలు చేశారు. యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నా.. ఎందుకు ప్రత్యేక రిజర్వేషన్ అమలు చేయటం లేదని నిలదీశారు. పర్బానీ జిల్లా ఉస్మాన్ బాద్ లో రైళ్లను అడ్డుకున్నారు. రహదారులపై ఎక్కడిక్కడ బైఠాయించి టైర్లను కాల్చుతున్నారు. పరిస్థితులు చేయిదాటిపోకుండా ముందుగానే స్పందించారు సీఎం ఫడ్నవిస్. ముందుగా ఆందోళనలు మహారాష్ట్ర మొత్తం విస్తరించకుండా ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమస్య పరిష్కారానికి హామీ ఇస్తున్నానని.. వెంటనే కమిటీ ఏర్పాటు అవుతుందని ప్రకటించారు.

Posted in Uncategorized

Latest Updates