ఔరా.. పతంజలి డిమాండ్ : గంజాయి మంచిదే.. చట్టబద్ధం చేయండి

embed_1518070906

గంజాయి పట్టుబడింది.. గంజాయి పెంచుతున్నారు.. గంజాయిని తగలబెట్టాం.. గంజాయితో జీవితాలు నాశనం అవుతున్నాయి.. ఇలాంటి వార్తలు రెగ్యులర్ గా వింటాం. ఇందుకు విరుద్ధంగా పతంజలి ప్రాడక్ట్స్ సంచలన డిమాండ్ చేసింది. భారతదేశంలో గంజాయిని చట్టబద్ధం చేయాలని కోరుతుంది. పురాతన కాలంలో గంజాయి మొక్కలను వైద్య అవసరాల కోసం ఉపయోగించేవారని.. ఆ మొక్కల్లోని ఔషధాలు ఎన్నో రోగాలను నయం చేసిందని చెబుతోంది. గంజాయిలోని ఉపయోగాలను ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో పతంజలి కంపెనీ అధ్యయనం చేస్తుందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాలకృష్ణ ప్రకటించారు.

హరిద్వార్ లోని పతంజలి రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ లో 200 మంది శాస్త్రవేత్తలు దేశీయ మొక్కలు, వాటి ప్రయోజనాలు, వైద్య అవసరాలపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. విదేశాల్లో ఈ గంజాయి చట్టబద్దమైనప్పటికీ.. భారత్ లో ఇది చట్ట వ్యతిరేకంగా భావిస్తున్నారన్నారు బాలకృష్ణ. గంజాయి వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయంటున్నారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ గంజాయి చట్టబద్దమైనదని, దీని ద్వారా 800 కోట్ల ఆదాయంతో అక్కడ ఈ పంట లాభాలను ఆర్జిస్తుందన్నారు. కెనడాలో కూడా చట్టబద్దమైనని, కెనడా GDPలో దాని వాటా 0.2 శాతం అని తెలిపారు.

యూరప్ దేశాల్లోని మార్కెట్లలో గంజాయి మొక్కల ద్వారా ఆయిల్స్ , ఫైబర్, దుస్తుల్లో ఉపయోగిస్తున్నారని వివరించారు. విషకారకమైన పదార్ధాలను ఆ మొక్కల్లో నుంచి తొలగించి ఉపయోగపడే విధంగా అందిస్తామని.. అందుకు కావాల్సిన అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు బాలక్రిష్ణ. దీనిని భారత్ లో చట్టబద్దం చేయడం ద్వారా ప్రజలకు ఇది ఓ వ్యాపార అవకాశంగా కూడా మారుతుందని అభిప్రాయపడ్డారు పతంజలి చీఫ్ ఎగ్జిక్యూటివ్.

Posted in Uncategorized

Latest Updates