కంగ్రాట్స్ ఎన్టీఆర్ : నందమూరి వంశంలోకి మరో వారసుడు

jr-ntr-son-2నందమూరి వంశంలోకి మరో వారసుడు వచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తండ్రి అయ్యారు. జూన్ 14వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఎన్టీఆర్ భార్య ప్రణతి పండంటి మగ బిడ్డకు జన్మనించింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. తన ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. కుటుంబం పెద్దది అయ్యింది.. మరోసారి బాబు పుట్టాడు అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఎన్టీఆర్ కు బాబు పుట్టిన విషయం తెలిసిన వెంటనే.. తండ్రి హరికృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వెళ్లి బాబుని చూశారు.

ఎన్టీఆర్ కు బాబు పుట్టిన విషయం తెలిసిన వెంటనే.. ఆయన ఫ్రెండ్స్, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఎన్టీఆర్ ట్విట్ ను షేర్ చేస్తూ.. కంగ్రాట్స్ అంటూ రీట్విట్ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates