కంచే చేను మేసిందా : ICICI లో చందాకొచ్చర్ క్విడ్ ప్రోకో

chandaమొన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్, నిన్న ఐడీబీఐ బ్యాంక్, ఇప్పుడు బ్యాంక్ కుంభకోణాల వరుసలో ఐసీఐసీఐ కూడా చేరింది. ప్రయివేటు బ్యాంక్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్ పై క్విడ్‌ ప్రో కో విమర్శలు వచ్చాయి. వీడియోకాన్‌ గ్రూప్‌ కు రుణాలిచ్చినందుకు గాను కొచ్చర్ కుటుంబానికి లబ్ధి జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి..
2008 డిసెంబర్ లో ICICI బ్యాంక్‌ సీఈవో చందా కొచ్చర్ భర్త దీపక్‌ కొచ్చర్ తో పాటు ఆమె మరో ఇద్దరు బంధువులతో కలసి వీడియోకాన్‌ గ్రూప్‌ ప్రమోటరు వేణుగోపాల్‌ ధూత్‌ న్యూపవర్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తన సొంత కంపెనీ నుంచి ఈ కొత్త సంస్థకు ధూత్ 64 కోట్ల రుణమిచ్చాడు. అయితే ఆ తర్వాత కేవలం 9 లక్షలకు న్యూపవర్‌లోని తన వాటాలు, యాజమాన్య అధికారాలన్నీ దీపక్‌ కొచర్‌కి బదలాయించేశారు అయితే, వీడియోకాన్‌ గ్రూప్‌ కు ICICI బ్యాంక్ నుంచి 3 వేల 250 కోట్ల రూపాయల రుణం మంజూరైన ఆరు నెలల్లోనే న్యూపవర్‌ కంపెనీ చేతులు మారటం పెద్ద చర్చనీయమైంది. ఇందులో చందా చందా కొచ్చర్ భర్త దీపక్‌ కొచర్, ఇతర కుటుంబసభ్యులు లభ్ధిపొందటంతో ఈ కుంభకోణంలో ఆమె పాత్రపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే వీడియోకాన్‌ తీసుకున్న మొత్తం రుణం 3 వేల 250 కోట్లలో ఇప్పటికీ 2 వేల 810 కోట్లు ఇంకా కట్టలేదు. దీంతో 2017లో వీడియోకాన్‌ ఖాతాను మొండిపద్దుగా తేల్చేశారు.
ఈ వ్యవహారంపై స్పందించిన ICICI చైర్మన్‌ ఎం.కె. శర్మ మాట్లాడుతూ… కన్సార్షియంలో ఎస్‌బీఐ, ఐడీబీఐ బ్యాంకులు రుణాలు ఇచ్చిన తర్వాతనే 2012లో ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కమిటీ 3 వేల 250 కోట్ల రుణం మంజూరు చేసిందని తెలిపారు. అయితే ఆ కమిటీకి అప్పట్లో చందా కొచర్‌ చైర్‌ పర్సన్‌గా లేరని శర్మ తెలిపారు. బ్యాంకులో ఏ స్థాయి ఉద్యోగైనా సరే రుణ నిర్ణయాలను ప్రభావితం చేయలేరని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates