కంటతడి పెట్టకుండా ఎవరూ ఉండలేరు: మోడీ

అండర్-20 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 400 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న హిమదాస్.. ఆ మెడల్‌ను అందుకున్న సమయంలో భావోద్వేగానికి లోనైంది. మెడల్ సెర్మనీ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో హిమదాస్ ఆనందభాష్పాలను రాల్చింది. జ‌న‌గ‌ణ‌మ‌న‌ వల్లిస్తూనే ఆమె కన్నీరును ఆపుకోలేకపోయింది.

హిమ దాస్‌ అరుదైన ఘనతపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. విజేతగా నిలిచిన హిమ దాస్‌ మన జాతీయ గీతాన్ని పాడటం మనసును కరిగించిందంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు వీడియో చూసిన భారతీయులెవ్వరూ సంతోషంతో కంటతడి పెట్టకుండా ఉండలేరన్నారు మోడీ.

మరోవైపు మహాంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహాంద్రా… హిమ దాస్‌ కంటతడి పెట్టిన వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేవారు. ఇది మిమ్మల్ని కదిలించకపోతే, ఇక ఏదీ మిమ్మల్ని కదిలించలేదని ఆయన తన ట్యాగ్‌లైన్‌లో తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates