కంటిచూపును మెరుగుపరిచే బీన్స్

ఎముకల దృఢత్వంతో పాటు కంటిచూపును పెంచడంలో బీన్స్ కీలకపాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బీన్స్ లో ఉండే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుందని చెప్పారు. బీన్స్‌లో పీచు, విటమిన్‌‌‌‌ ఎ, బి, కె, ఫోలేట్‌, మెగ్నీషియం వంటివి ఉండటం వలన రక్తంలోని కొలెస్ట్రా ల్‌ తగ్గుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజుకు కప్పు బీన్స్‌ తీసుకుంటే వ్యాధి తీవ్రతను తగ్గించుకోవచ్చు.

బీన్స్ లో విటమిన్ బి6, థయామిన్, విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. బీన్స్‌లో ఉండే ఫ్లేవనాయిడ్స్ క్యాన్సర్ కారకాలను నిరోధిస్తాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరచడంలో చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. బీన్స్‌లో పీచు, విటమిన్ ఎ, కె, కోలెడ్, మెగ్నీషియం రక్తంలోని కొలెస్ట్రా ల్ తగ్గించేందుకు సహాయపడుతుంది.

Posted in Uncategorized

Latest Updates