కంటి గ్లాసులతో దొంగల్ని పట్టేస్తాం

kiranటెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఈ దశాబ్ధంలోనే తమకు ప్రపంచంలో తిరుగులేదంటూ దూసుకెళ్తుంది చైనా. అటువంటి చైనా ఇప్పుడు దొంగలను పట్టుకునేందుకు ఓ కొత్త విధానంతో ముందుకు వచ్చింది. కేవలం సూర్యకిరణాల నుండి కంటిని రక్షించకోవడానికి మనం వాడే కూలింగ్ గ్లాసెస్ తో క్రిమినల్స్ ను పట్టుకోవచ్చు అంటుంది చైనా. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉన్న కంటి అద్దాలను ఇప్పుడు చైనా పోలీసులు వాడుతున్నారు. క్రిమినల్స్‌కు సంబంధించిన డేటాబేస్‌తో సన్‌గ్లాసెస్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఎక్కడ నేరస్తులు కనిపించినా చాలా సులువుగా దొంగల్ని పోలీసులు గుర్తిస్తున్నారు. సన్‌గ్లాసెస్‌తో తీసిన ఫోటోలను డేటాబేస్‌తో చెక్ చేస్తారు. ఒకవేళ ఆ ఫోటోలు మ్యాచ్ అయితే, ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేస్తారు.  జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా తమ కంటి అద్దాలతో స్కాన్ చేసి దొంగలను సులభంగా అరెస్టు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సన్‌గ్లాసెస్‌తో మొత్తం ఏడు మంది అనుమానిత క్రిమినల్స్‌ను పట్టుకున్నారు చైనా పోలీసులు. బిజీగా ఉండే జెంగ్‌జో రైల్వే స్టేషన్‌లో వాళ్లు దొంగల్ని గుర్తించారు. ఈ రకమైన అద్దాలతో మరో 26 మంది ఫేక్ ఐడీలను కూడా గుర్తించారు. అయితే ఈ టెక్నాలజీతో ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయని అప్పుడే ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates