కంటి వెలుగుకు ఏర్పాట్లు పూర్తి : కడియం

ఆగస్ట్ 15 నుంచి కంటి వెలుగు పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు చేయడానికి ప్రభుత్వం 51 కోట్లు కేటాయించిందని చెప్పారు. సంక్షేమ పథకాల అమలుపై గురువారం (ఆగస్టు-2) వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష చేశారు కడియం. అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలనీ…..ఒత్తిడి ఉన్నా సేవా దృక్పదంతో పనిచేయాలన్నారు.

ఆగస్టు 15న కంటి వెలుగును తూప్రాన్ నుంచి ప్రారంభిస్తున్నట్టు మంత్రి హరీష్ రావు చెప్పారు. మెదక్ జిల్లా తూప్రాన్ లో పర్యటించిన మంత్రి… కొత్తగా ఏర్పాటు చేసిన తూప్రాన్ మున్సిపల్ ఆఫీసును ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా తూప్రాన్ అభివృద్దికి కృషి చేస్తున్నామన్నారు హరీష్ రావు. గజ్వెల్ తరహాలోనే డెవలప్ చేస్తామన్నారు.

Posted in Uncategorized

Latest Updates