కంట్రోల్ చేస్తున్నారు : రోబోలపై పడిన హ్యాకర్స్

వెబ్ సైట్లు.. ఫేస్ బుక్ అకౌంట్లు.. మొబైల్స్ హ్యాకింగ్ చేస్తున్నారు కొందరు సైబర్ నేరగాళ్లు. దీంతో వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. మరికొందరు వ్యక్తి గత రహస్యాలు తెలుసుకుని బ్లాక్ మెయిళ్లకు దిగుతున్నారు. ఇప్పటి వరకు జరుగుతున్నది ఇదే. ఇప్పుడు హ్యాకర్స్ రూటు మార్చారు. రోబోలపై దృష్టి పెట్టారు. రోబోలను తమ ఆధీనంలోకి తీసుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు వెల్లడించారు అమెరికన్ సైంటిస్టులు. రోబోల కదలికలను హ్యాకర్లు రిమోట్‌ ద్వారా కంట్రోల్ చేసే ప్రమాదం ఉందని.. రోబోల కెమెరాలోని ఇన్ఫర్మేషన్ ను దొంగిలించే అవకాశాలున్నాయని ఆందోళన చెందుతున్నారు. అమెరికాలోని బ్రౌన్‌ వర్శిటీకీ సైంటిస్టులు రోబో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ROS) ను ప్రపంచవ్యాప్తంగా స్కాన్‌ చేశారు. 2017–18 మధ్య చేసిన ఈ స్కానింగ్‌లో 100 వరకు సురక్షితం కాని వ్యవస్థలు ROSను నడిపిస్తున్నట్లు గుర్తించారు.

సురక్షితం కాని రోబోలకు ఇది పెద్ద సమస్య కాకపోవచ్చంటున్నారు. పరిశోధనలు చేసే రోబోలు మాత్రం పబ్లిక్‌ ఇంటర్నెట్‌ ద్వారా అందుబాటులోకి వచ్చే ప్రమాదం ఉంది. వాటిని నియంత్రించవచ్చంటున్నారు. రోబోలకు, వాటిని నడిపే మనుషులకూ ప్రమాదంగా మారేలా వాటిని ప్రభావితం చేయొచ్చని చెబుతున్నారు. డిజిటల్‌ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. రోబోల్లో ఉండే ROS టెక్నాలజీని హ్యాక్‌ చేయడం ద్వారా రోబో కెమెరాలు, సెన్సర్లు తదితర పరికరాలనూ నియత్రించవచ్చని తెలిపారు. ఇప్పటికే కొన్ని రోబోలను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు సైంటిస్టులు.

Posted in Uncategorized

Latest Updates