కంట తడిపెట్టిన సీఎం కుమారస్వామి

కర్ణాటక సీఎం కుమారస్వామి కంటతడి పెట్టుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వం క్రమంలో తాను చాలా బాధతో ఉన్నానని ఆయన తెలిపారు. జేడీఎస్ నేతలు ఏర్పాటు చేసిన ఓ సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ..మీ అన్నయ్యో, తమ్ముడో సీఎం అయినట్టు మీరంతా సంతోషిస్తున్నారు … కానీ సంతోషంగా లేనని తెలిపారు. నిత్యం బాధను దిగమింగుతున్నానన్న కుమారస్వామి..అది విషానికి తక్కువేం కాదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంత సంతోషంగా లేనని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

తల్లిదండ్రుల ఆశీర్వాదం కారణంగానే సీఎంనయ్యానని.. ఓ వర్గానికి నొప్పికలిగించానేమోగానీ.. పరిమితికి మించి కష్టపడుతున్నానన్నారు. తాను తలుచుకుంటే రెండు గంటల్లో రాజీనామా చేయగలనని.. అధికారం వదులుకునేందుకు సిద్ధమని.. పదవి కోసం పాకులాడేది లేదని ప్రకటించారు. సీఎం ఛైర్ మీద వ్యామోహం లేదని.. స్వాభిమానం కోసం పాటుపడతానని పరోక్షంగా కాంగ్రెస్ ను హెచ్చరించారు. రెండు నెలలు తనపై విమర్శల దాడి కొనసాగితే ఇంకోలా ఆలోచిస్తాని వార్నింగ్ ఇచ్చారు సీఎం కుమార స్వామి.

Posted in Uncategorized

Latest Updates