కంపు దొంగలు : కారులో వచ్చి మ్యాన్ హోల్ మూతలు ఎత్తుకెళ్లారు

దొంగలకు ఫ్రీగా వస్తే చెంచాను కూడా వదలరు అనడానికి లేటెస్ట్ గా జరిగిన దొంగతనమే నిదర్శనం. ఇద్దరు దొంగలు దర్జాగా కారులో వచ్చారు. ఏ బ్యాంకుకో.. ధనవంతుడి ఇంటికో కన్నం వేశారంటే పొరపాటే. వీరు దొంగిలించింది మ్యాన్ హోళ్ల మూతలు. విచిత్రంగా ఉంది కదూ. హైదరాబాద్ నిమ్స్ హస్పిటల్ దగ్గర జరిగిన ఈ సంఘటనతో పోలీసులే ఆశ్చర్యపోయారు.

నిమ్స్ హస్పిటల్ స్పెషాలిటీ బ్లాక్ దగ్గర పుట్ పాత్ పై ఉన్న 10 మ్యాన్ హోళ్ల మూతలను దొంగలు ఎత్తుకెళ్లారు. నిమ్స్ అధికారులు సెక్యూరిటీ సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. సెక్యురిటీ డ్యూటీ సరిగ్గా చేయకపోవడంతోనే దొంగతనాలు జరుగుతున్నాయని, మ్యాన్ హోళ్ల మూతల ఖరీదు చెల్లించాలని తెలిపింది నిమ్స్. దీంతో సెక్యూరిటీ సంస్థ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. CCTV పుటేజ్ ను పరిశీలించిన పోలీసులకు ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి, మ్యాన్ హోల్ మూతలను ఎత్తుకెళ్లే దృశ్యాలు కనిపించాయి. చెట్ల కొమ్మలు అడ్డుగా ఉండటంతో దొంగల ముఖాలు గుర్తుపట్టలేకపోయామని.. త్వరలోనే ఈ కంపు దొంగలను పట్టుకుంటామని తెలిపారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates