కొత్త పార్కింగ్ ఛార్జీలు ఇలా ఉన్నాయి :
మొదటి అర గంట (30 నిమిషాలు) : ఎలాంటి పార్కింగ్ ఫీజు ఉండదు. వసూలు చేయకూడదు. ఉచితంగా పార్కింగ్ ఉంటుంది. ఎంట్రీ – ఎగ్జిట్ దగ్గర టైం చూసి ఫ్రీ పార్కింగ్ అనుమతికి అవకాశం ఇస్తారు.
31 నుంచి 60 నిమిషాల వరకు : మాల్స్, మల్టీఫ్లెక్స్ లు, వాణిజ్య సముదాయాల్లోకి వెళ్లిన తర్వాత ఏదైనా వస్తువు కొనుగోలు చేసినట్లు బిల్లు చూపిస్తే పార్కింగ్ ఫ్రీ. ఎలాంటి వస్తువు కొనుగోలు చేయకపోతే ఫీజు వసూలు చేస్తారు.
గంట తర్వాత (60 నిమిషాలు పైన) : సినిమా టికెట్ లేదా షాపింగ్ బిల్లు చూపిస్తే ఎలాంటి ఫీజు ఉండదు. అయితే ఓ కండీషన్ ఉంది. సినిమా టికెట్ లేదా షాపింగ్ బిల్లు పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు ఫీజు వసూలు చేయరు. అలా కాకుండా సినిమా టికెట్ రూ.150 ఉండి.. పార్కింగ్ ఫీజు 170 ఉంటే.. పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.