కటకటాల్లో భర్త : ఇంట్లో ఇల్లాలు..ఆఫీసులో ప్రియురాలు

హైదరాబాద్ : అతడికి పెళ్లై 11 సంవత్సరాలైంది. ఓ పాప ఉంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. సాఫీగా సాగుతున్న జీవితాన్ని వివాహేతర సంబంధంతో చేతులారా పాడు చేసుకున్నాడు. ప్రియురాలి మోజులో పడి, భార్యకి నిత్యం నరకం చూపిస్తున్నాడు. ప్రియురాలితో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పజెప్పింది భార్య. ఈ సంఘటన మంగళవారం హైదరాబాద్ లో జరిగింది.

వివరాల్లోకెళితే..

నల్గొండ జిల్లా, నకిరేకల్‌ కు చెందిన నాగరాజుకు అమూల్యతో 2007లో వివాహం జరిగింది. వీరికి ఎనిమిదేళ్ల కూతురు ఉంది. నాగరాజు TCS కంపెనీలో టీంలీడర్‌ గా పనిచేస్తున్నాడు. తన టీంమెంబర్‌ అయిన ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె మాయలో పడి భార్యాపిల్లలను పట్టించుకోవడం మానేశాడు. కొన్ని రోజులముందు  ఇంటి నుంచి గెంటేశాడు. తనకు అన్యాయం చేయొద్దని బాధితురాలు భర్తను ప్రాధేయపడినా వినకుండా.. హస్తినాపురం ద్వారాకానగర్‌ లో ప్రియురాలితో ఆరు నెలలుగా వేరే కాపురం కొనసాగిస్తున్నాడు. ఇది తెలుసుకున్న అమూల్య…వారిద్దరినీ మంగళవారం రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది.

తనను, కూతురిని వదిలించుకోడానికి నాగరాజు స్కెచ్ వేశాడని తమకు ప్రాణహాని ఉందని అమూల్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates