కట్టలపాములు : పాతవి 3.. కొత్తవి 2 కోట్లు పట్టివేత

పాత నోట్లు రద్దయ్యి రెండు సంవత్సరాలు అవుతుంది.. ఇంకా ఇవి దొరకటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కోట్లకు కోట్ల నగదు పట్టుబడుతుండటంతో పోలీసులు కూడా షాక్ అవుతున్నారు. మహారాష్ట్రలో పాతనోట్లను మారుస్తాం అంటూ చెప్పుకుంటున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి మూడు కోట్ల విలువైన పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అన్నీ పాత 500, వెయ్యి నోట్లు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదిలా ఉండగా మరో ఘటనలో ఉత్తరప్రదేశ్‌లోని మొఘల్‌సరాయ్ రైల్వే స్టేషన్‌లో కొత్త 2వేల నోట్ల కట్టలను సీజ్ చేశారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. లెక్కలు చూపించకపోవటంతో సీజ్ చేశారు. ఈ డబ్బును ఎక్కడికి తరలిస్తున్నారు.. ఎవరికి చేరవేస్తున్నారు అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates