కట్టలు తెంచుకున్న కోపం : సర్పంచ్ ను కొరికిన కానిస్టేబుల్

BITEపట్టరాని కోపంతో ఏం చేయాలో అర్ధంకాని ఓ కానిస్టేబుల్ చేసిన వ్యవహారం.. సోషల్ మీడియాలో అందరినీ నవ్వులు పూయిస్తుంది. కానిస్టేబుల్ కి స్థానిక సర్పంచ్ కి గొడవ. కోపంతో రగిలిపోయిన కానిస్టేబుల్ కి కొట్టాలో ..తిట్టాలో అర్థంకాక, కోతివేషాలేశాడు. సర్పంచ్ ని కొడితే బాగోదనుకున్నాడో ఏమో. కోపం ఆపుకోలేక సర్పంచ్ ని ఎక్కడపడితే అక్కడే కొరికాడు. పంటిగాట్లు స్పష్టంగా పడ్డాయి. ఈ ఆధారాలతో సర్పంచ్ కొట్టినదానికంటే ఎక్కువగా అరుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాపం కానిస్టేబుల్ కోపం దిగమింగుకుని కొట్టకపోయిన కేసు నమోదైందని లబోదిబోమంటూ పోలీసులకు జరిగిన విషయం చెప్పుకొచ్చాడు

వివరాల్లోకెళితే..ఈ సంఘటన గోవాలో జరిగింది. గ్రామ సర్పంచి చేతిని కొరికిన పోలీసు కానిస్టేబుల్‌ పై శనివారం (జూన్-30) FIR నమోదైంది. నిందితుడు కానిస్టేబుల్ గెను వెలిప్‌ పై పోలీసులు సెక్షన్‌-324(గాయపర్చడం) కింద కేసు నమోదు చేశారు. అక్రమ నీటి కనెక్షన్‌ విషయంలో సర్పంచ్‌, కానిస్టేబుల్‌ ఇద్దరూ గొడవపడినట్లు తెలిసింది. కాటిగోవా సర్పంచి ఉమేష్‌ గోవాన్కర్‌ చేతిని రెండు సార్లు కానిస్టేబుల్‌ గెను వెలిప్‌ కొరికినట్లు FIR నమోదైంది. కొరికిన గాటు గుర్తులను, నిందితుడి పంటి గుర్తులను డెంటల్‌ ఫోరెన్సిక్‌ పద్ధతిలో తాము తీసుకున్నామని, రెండింటినీ సరిపోల్చి చూస్తామని, నేరం నిరూపితమైతే నిందితుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates