కఠిన శిక్షలే : బాల్ ట్యాంపరింగ్ పై కొత్త నిబంధనలు

ballబాల్ ట్యాంపరింగ్ పై కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది ఐసీసీ. ట్యాంపరింగ్ కు పాల్పడితే…ప్లేయర్లకు కఠిన శిక్షలు విధించనుంది. ఐర్లాండ్ లో ఐదు రోజుల పాటు నిర్వహించిన సమావేశాల్లో కమిటీల సూచనలకు అధికారులు ఆమోదం తెలిపారు. అంతేకాదు మ్యాచ్ లో ఎవరినైనా దూషించినా, మ్యాచ్ జరిగే టైంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఏం చేసినా….ఆటగాళ్ల ఖాతాలో డీమెరిట్ పాయింట్లు యాడ్ చేయనుంది. మరోవైపు మ్యాచుల్లో నిషేధం విధిస్తుంది.
గతంలో బాల్ టాంపరింగ్ కు పాల్పడితే ఒక టెస్టు లేదా రెండు వన్డేల నిషేధం మాత్రమే విధించేవారు. కానీ….ఇకపై ఆటగాడి ఖాతాలో ఏకంగా 12 డీమెరిట్ పాయింట్లు జత చేసి…ఆరు టెస్టులు లేదా 12 వన్డేలకు దూరం చేయనుంది. ఇంతకుముందు లెవల్ -2లో ఉన్న బాల్ టాంపరింగ్ ను లెవల్ -3కి మార్చారు. లెవల్ -1,2,3 కింద నిబంధనలు ఉల్లంఘించిన ఆటగాళ్ల అప్పీల్ ను మ్యాచ్ రిఫరీలు వింటారు. లెవల్ -4లో మాత్రం జ్యుడీషియల్ కమిషనర్లు విచారణ చేపడతారు. మరోవైపు ఐసీసీ విధించిన శిక్షను అప్పీలు చేసే….ఆటగాళ్లు కొంత ఫీజును కూడా చెల్లించాలి.

Posted in Uncategorized

Latest Updates