కడపలో ఘోరం : ఒంటిమిట్ట చెరువులో తేలాడుతున్న మృతదేహాలు

poiకడప జిల్లాలో ఘోరం వెలుగుచూసింది.కడప జిల్లా ఒంటిమిట్టలోని చెరువులో  పడి తేలాడుతూ ఉన్న 7 మృతదేహాలు కలకలం రేపాయి. రేణిగుంట జాతీయ రహదారిని అనుకుని ఉన్న ఒంటిమిట్ట చెరువులో ఈరోజు(ఫిబ్రవరి18) స్థానికులు 7 మృతదేహాలను గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతులు ఎర్రచందనం కూలీలు అయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరిని ఎవరైనా హత్య చేశారా? లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా అక్కడికి తరలివస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates