కడెం ప్రాజెక్టుకు జలకళ : మూడు గేట్లు ఎత్తివేత

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నిండు కుండల్లా కనిపిస్తున్నాయి. జలాశయాలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయం మూడు వరదగేట్లను ఎత్తి గోదావరిలోకి 19012 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.

ఆదివారం (జూలై-15) రాత్రి  నుంచి సోమవారం (జూలై-16)మధ్యాహ్నం వరకు నిరంతరాయంగా వర్షం కురవడంతో.. జలాశయంలోకి 12వేల 840 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 697.525 అడుగులు (6.972టీఎంసీల) వద్ద ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉండగా, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీటిని అధికారులు ప్రధానగేట్ల ద్వారా గోదావరి గుండా ఎల్లంపల్లి జలాశయంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది.

Posted in Uncategorized

Latest Updates