కడెం ప్రాజెక్టు D-13 కాలువ మరమ్మతులకు అనుమతి

HY09KADEM_PROJECTకడెం ప్రాజెక్టు డి-13 కాలువ మరమ్మతు పనులకు పరిపాలన పరమైన అనుమతులకు ఆమోదం తెలిపారు మంత్రి హరీశ్‌రావు. గత ఏడాది ఊట్నూరు పర్యటనలో డి-13 కాలువ పరిధిలోని రైతులు మంత్రి హరీశ్‌ను కలిసి కాలువ మరమ్మతులు చేయాల్సిందిగా కోరారు. ఇచ్చిన హామీ మేరకు మంత్రి ఇవాళ రూ. 10.47 కోట్లతో డి-13 కాలువ పనులకు అనుమతి ఇచ్చారు. కాలువ పరిధిలో క్రాస్ డ్రైనేజీ వర్క్స్ పాతకాలం నాటివి. రాళ్లతో నిర్మించినవి. అవి శితిలమైన చోట సిమెంట్ పనులు చేపట్టనున్నారు. వీటితో పాటు వంతెనలు, తూములు,డ్రాప్స్, సైఫన్, గైడ్ వాల్స్ నిర్మాణాలకు సంబంధించి రక్షణ గోడలు, పియర్స్, కాలువ కట్టలను పటిష్టం చేయడం, మొరం మట్టితో కాలువ చుట్టు మట్టిని గట్టిపరచడం, సీఎన్‌ఎస్ ట్రీట్‌మెంట్ పనులు, ప్రస్తుతం ఉన్న నిర్మాణాలకు మరమ్మతులు, పూర్తిగా పాడయిన నిర్మాణాల స్థానంలో కొత్తవి నిర్మించడం, 75 మిల్లీ మీటర్ల మందంతో కాలువ లైనింగ్ పనులు, తూముల షట్టర్ల మరమ్మతు పనులు చేపట్టనున్నారు.

Posted in Uncategorized

Latest Updates