కణకణ మండుతూ : సముద్రం వైపు హవాయి లావా

hawaiఅమెరికాలోని హవాయి ద్వీపంలోని కిలావుయా అగ్నిపర్వత విస్పోటనం ప్రస్తుతం సముద్రం దగ్గరకు చేరుకుంది. రెండు వారాల క్రితం అగ్నిపర్వత విస్పోటనం జరిగి చట్టుపక్కల ప్రాంతాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఇప్పుడు మరింత ప్రమాదకరంగా రోడ్లపై ప్రవహిస్తున్న లావా.. సముద్రం దగ్గరకు చేరుకుంది. ఈ లావా ప్రవాహం దెబ్బకు వేల సంఖ్యలో ఇళ్లు, వాహనాలు కాలి బూడిదైపోయాయి. రోడ్లపై లావా ప్రవహిస్తుండటంతో విషవాయువులు గాల్లో కలిస్తున్నాయి. దీంతో అధికారులు ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ఫేస్ మాస్క్ లు అందించారు.

లావా ప్రవాహం సముద్ర తీరం దగ్గర్లోకి వచ్చిందని యూఎస్ జియోలాజికల్ సర్వే సైంటిస్ట్ వెండీ స్టోవల్ తెలిపారు. సముద్ర తీర ప్రజలు, బీచ్ కి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సముద్రంలోకి ఎవరూ వెళ్లొద్దని సూచించారు. బోట్లను కూడా దూరంగా ఉంచాలని ఆదేశించారు. బోటర్స్ అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ సివిల్ ఢిఫెన్స్ నోటీసులు జారీ చేసింది.

 

Posted in Uncategorized

Latest Updates