కత్తిలాంటి ఖైదీలు.. జైల్లో అందాల పోటీలు

అక్కడ అందాల పోటీలు జరిగాయి. అందంగా ఉన్న ఆడవారి పోటీలే అవి. కానీ…. అవి జరిగింది ఏ ఆడిటోరియం, హోటళ్లు, కెన్వెన్షన్ సెంటర్లలో కాదు.. ఓ జైల్లో. ఔను. బ్రెజిల్ లోని రియో డీజెనీరోలో… తలవెరా బ్రూస్ జైలు ఈ అందాల పోటీలకు వేదికైంది.

ఈ జైల్లో ఉన్న మహిళా ఖైదీల మధ్య అందాల పోటీలు జరగడం ఇది పదమూడోసారి. పదమూడో వార్షిక అందాల పోటీల్లో అచ్చు బ్యూటీ పేజాంట్ లో సందడి చేసినట్టుగానే మహిళా ఖైదీలు అలంకరించుకున పార్టిసిపేట్ చేస్తారు. మాజీ ఖైదీ సుందరి .. లేటెస్ట్ గా ఎన్నికైన ఖైదీ బ్యూటీకి క్రౌన్ తొడుగుతుంది.

మహిళా ఖైదీల హక్కులు కాపాడటం.. వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడం.. వారి గౌరవాన్ని ఇనుమడింపజేయడం లాంటి లక్ష్యాలతో ఇక్కడ జైల్లో ఇలాంటి పోటీలు పెడుతుంటారు. మిస్ తలవెరా బ్రూస్ 2017 మయానా రోసా ఆల్వ్స్… 2018 కిరీటం గెలుచుకున్న మహిళా ఖైదీ వెరోనికా వెరోన్ కు కిరీటం తొడిగింది.

 

Posted in Uncategorized

Latest Updates