కత్తి మహేష్ అరెస్టు

kathi
సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్ ను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా మహేశ్‌ను సోమవారం(జులై-2) రాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. మహేశ్‌ గత రెండురోజుల క్రితం బంజారాహిల్స్‌లోని ఓ టీవీ ఛానెల్‌ చర్చ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా మహేశ్ ఫోన్ ఇన్ లో మాట్లాడుతూ సీతారాములను కించపరిచేలా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

దీంతో తమ ఆరాధ్య దైవాన్ని మహేశ్ కించపరిచేలా మాట్లాడటంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కత్తి మహేశ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనను అరెస్ట్‌ చేసి స్టేషన్ కు తరలించారు. మంగళవారం(జులై-3) రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.

Posted in Uncategorized

Latest Updates