కథువా రేప్ ఘటనపై జమ్మూకాశ్మీర్ సర్కార్ కు సుప్రీంకోర్టు నోటీసులు

kathuaకథువా రేప్ ఘటనపై జమ్మూకశ్మీర్ సర్కార్ కు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. బాధితురాలి కుటుంబానికి, వారి తరపున వాదనలు వినిపిస్తున్న వారికి భద్రత కల్పించాలని ఆదేశించింది. కేసు దర్యాప్తులో పోలీసుల తీరును ప్రశంసించారు బాధితురాలి కుటుంబం తరపు లాయర్ ఇందిరా జైసింగ్. నిందితులను అందరినీ అరెస్ట్ చేయడంతో పాటు సాక్ష్యాధారాలను సమర్ధంగా సేకరించారన్నారు. మరోవైపు కటువా ఘటనపై సుప్రీంకోర్టు దగ్గర మౌన ప్రదర్శన నిర్వహించారు లాయర్లు. చట్టాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన జమ్మూకశ్మీర్ లాయర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates