కదం తొక్కుతున్నారు : ఢిల్లీలో రోడ్డెక్కిన CBSE స్టూడెంట్స్

cbseమార్చి 28 న దేశం మెత్తం జరిగిన మాథ్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే కొద్ది సేపటి ముందు CBSE చైర్ పర్సన్ అనితా కర్వాల్ కి ఓ ఈ మెయిల్ వచ్చింది. వాట్సప్ ద్వారా క్వచ్చన్ పేపర్ లీక్ అయిందని ఆ మెయిల్ లో ఉంది. క్వచ్చన్ పేపర్ ను అటాచ్ చేసి ఈ పరీక్షను రద్దు చేయాలంటూ ఓ విద్యార్ధి తన తండ్రి జీ మెయిల్ అకౌంట్ ద్వారా చైర్మన్ కు విజ్ణప్తి చేశాడు. అయితే ఎగ్జామ్ నిర్ణయించిన సమయానికి యధావిధిగా జరిగినప్పటికీ అదే రోజున CBSE అధికారులు క్రైం బ్రాంచి పోలీసులకు ఈ విషయమై కంఫ్లెయింట్ చేశారు. దీంతో విచారణ ప్రారంభించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దీనిపై విచారణ ప్రారంభించింది. అయితే సీబీఎస్ ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ పేపర్ లీకేజీపై విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని ప్రీత్ విహార్ లోని సీబీఎస్ ఆఫీస్ ముందు ఈ రోజు(మార్చి31) ఉదయం ఆందోళనకు దిగారు. తమ భవిష్యత్తుతో ఆడుకోవద్దంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున విద్యార్ధులు ఆందోళలో పాల్గొన్నారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

మరోవైపు పేపర్ లీకేజీపై కేంద్ర మంత్రి జవదేకర్ శుక్రవారం(మార్చి30) స్పందించారు. 16 లక్షల మంది సీబీఎస్‌ఈ మ్యాథ్స్ పేపర్ రాశారని, అయితే అందులో 14 లక్షల మంది మళ్లీ ఆ పేపర్‌ను రాయాల్సిన అవసరం లేదని శుక్రవారం(మార్చి30) జవదేకర్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates