కదలని రుతుపవనాలు.. మండుతున్న ఎండలు

రాష్ట్రంపై నైరుతి రుతుపవనాలు ప్రభావం చూపటంలేదు. నాలుగైదు రోజుల్లో.. ఒకటి రెండుచోట్ల మోస్తరు వర్షాలు తప్ప ఎక్కడా పెద్దగా వర్షాలు పడలేదు. ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్రలోనూ రుతుపవనాల కదలిక మందగించిందని తెలిపింది హైదరాబాద్ వాతావరణశాఖ. పశ్చిమ లేదా దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం లేదా వాయుగుండం ఏర్పడితే.. దాని ప్రభావం తెలంగాణపై ఉంటుందన్నారు. అప్పటి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది.

రుతుపవనాల నెమ్మదించడం, ఎక్కడికక్కడ నిలిచిపోవటంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం గరిష్ఠం 34 డిగ్రీలు నమోదు అవుతుంది. హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, హన్మకొండ, రామగుండంలో అత్యధిక టెంపరేచర్ నమోదు అవుతుంది. మరో రోజులు వాతావరణం ఇలాంటి పొడి వాతావరణమే ఉండబోతున్నది. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడితేనే వాతావరణంలో మార్పులు వస్తాయి. మళ్లీ వర్షాలు పడతాయి.

 

Posted in Uncategorized

Latest Updates