కనికరంలేని తల్లిదండ్రులు : పసిపాపను చర్చిలో వదిలేశారు

CHILDకేరళలోని కొచ్చిలో దారుణం జరిగింది. ఎక్కువమంది పిల్లలు పుట్టారన్న అవమానంతో ఓ జంట పసిపాపను  చర్చిలో వదిలేసి వెళ్లింది. త్రిస్సూర్ కు చెందిన బిట్టో, ప్రతిభ దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. రెండు రోజుల క్రితం ప్రతిభ మరో పాపకు జన్మనిచ్చింది. అయితే నలుగురు పిల్లల్ని కన్నారని అందరు విమర్శిస్తారని.. శుక్రవారం సాయంత్రం ఎడప్పల్లి లోని సెయింట్ జార్జ్ ఫొరెన్ చర్చిలో వదిలేసి వెళ్లారు.

చిన్నారి అరుపులు విన్న సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించడంతో.. తల్లిదండ్రులే చిన్నారిని అక్కడ వదిలేసి వెళ్లారని తేలింది. వారిద్దరిపై కేసు ఫైల్ చేశారు పోలీసులు.  పిల్లల్ని కనే ముందు ఆలోచించాలి కానీ..ఇలా అనాదులుగా వదిలి వెల్లకూడదని మండిపడుతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Posted in Uncategorized

Latest Updates