సవ్యసాచి టీజర్ రిలీజ్

నాగచైతన్య హీరోగా .. చందూ మొండేటి  డైరెక్షన్ లో తెర‌కెక్కుతున్న మూవీ స‌వ్య‌సాచి. ఈ సినిమా టీజ‌ర్‌ ని ఇవాళ (అక్టోబర్-1) ఉద‌యం 10గం.ల‌కు రిలీజ్ చేసింది సినిమా యూనిట్. మామూలుగా ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే.. అన్నదమ్ములంటారు. అదే ఒకే రక్తం ఒకే శరీరం పంచుకుని పుడితే అది అద్భుతం అంటారు. కనిపించని అన్నని.. కడదాకా ఉండే కవచాన్ని..  ఈ సవ్యసాచిలో సగాన్ని అంటూ చైతు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.

టైటిల్ తోనే సినిమా ఆకట్టుకోగా ఇవాళ రిలీజైన టీజర్ మరింత హైప్ తెచ్చిందంటున్నారు ఫ్యాన్స్. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా.. చైతూ ఖాతాలో మ‌రో హిట్‌గా నిలుస్తుంద‌ని అంటున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌ టైన‌ర్‌ గా రూపొందుతున్న ఈ మూవీలో.. చైతూ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తుంది. ప్రేమమ్  తర్వాత చందు మొండేటి, నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కుతున్నఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ ఎక్స్‌ పెక్టేష‌న్స్ ఉన్నాయి. స‌వ్య‌సాచి అంటే రెండు చేతుల‌ని స‌మ‌ర్ధ‌వంతంగా, శ‌క్తివంతంగా వాడే వాళ్ళు అని అర్ధం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న  ఈ సినిమాలో.. మాధ‌వ‌న్, భూమిక‌లు ముఖ్య పాత్రలు పోషించారు. కీర‌వాణి  మ్యూజిక్. న‌వంబ‌ర్ 2న సవ్యసాచిని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Posted in Uncategorized

Latest Updates