కనిపించని ట్రాకింగ్ : ఫ్లిప్ కార్ట్ టెక్నికల్ ప్రాబ్లమ్

flipప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ లో టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తింది. ఫిబ్రవరి 16వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి కొంత మందికి ఆప్షన్స్ కనిపించటం లేదు. కొత్త ఆర్డర్స్ పెట్టుకున్న వారికి ట్రాకింగ్ స్టేటస్ కనిపించటం లేదు. ఆర్డర్ లిస్ట్ కూడా స్కీన్ పై కనిపించటం లేదు. దీంతో డెలివరీ కోసం వెయిట్ చేస్తున్న వారికి ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తే.. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి.. రెండు గంటల తర్వాత సెట్ అవుతుంది.. అంతరాయానికి చింతిస్తున్నాం అంటూ సమాచారం ఇస్తున్నారు.

ఫ్లిప్ కార్ట్ ఈ-కామర్స్ వెబ్ సైట్ లో సమాచారం లోపం వల్ల.. కస్టమర్లు అయోమయానికి గురవుతున్నారు. కొత్తగా ఆర్డర్ బుక్ చేసుకున్న వారికి స్టేటస్ మాత్రం కనిపించటం లేదు. దీంతో ఆర్డర్ పొజిషన్ తెలియక.. ఏమైంది అనే గందరగోళానికి గురవుతున్నారు. ఉదయం నుంచి ఈ సమస్య వచ్చింది. ఇది పరిష్కారం కావటానికి కొంత సమయం పడుతుందని.. కాల్ సెంటర్ సిబ్బంది చెబుతుండటంతో.. ఆర్డర్ బుకింగ్ కరెక్ట్ గా అయ్యిందా.. లేదా అనే ఆందోళన కూడా కస్టమర్లలో నెలకొంది.

Posted in Uncategorized

Latest Updates