కనిపించని నెలవంక : రంజాన్ పండుగపై క్లారిటీ వచ్చేసింది

ramzanరంజాన్ పండుగ శుక్రవారమా..శనివారమా అనే దానిపై క్లారిటీ ఇచ్చారు మత పెద్దలు. జూన్ 16, శనివారం రోజున పండుగను జరుపుకోవాలని నిర్ణయించారు. షవ్వాల్ నెల చంద్రవంక గురువారం కనిపించలేదని… దీంతో ఈదుల్ ఫిత్ (రంజాన్ పండుగ) 16న జరుపాలని మతపెద్దలు తీర్మానించారు. మొదట శుక్రవారం పండుగ జరుగుతుందని ముస్లింలు భావించారు.

ఆ మేరకు ఏర్పా ట్లు చేసుకున్నారు. అయితే చంద్రుడు కనిపించకపోవడంతో మరోరోజు ఉపవాస దీక్షకు ఉపక్రమిస్తున్నారు. తెలంగాణలో రంజాన్ పండుగపై అధికారిక ప్రకటన చేసే ముస్లిం ఉలేమాలు, ముఫ్తీలతో కూడిన రుహితే హిలాల్ కమిటీ గురువారం (జూన్-14) ఇక్కడి మోజంజాహి మార్కెట్ కమిటీ కార్యాలయంలో సమావేశమైంది. వివిధ ప్రాంతాల నుంచి చంద్రవంకకు సంబంధించి సమాచారం సేకరించారు. సూర్యుడు అస్తమించిన తరువాత రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన పలు ప్రాంతాల నుంచి ముస్లింలు ఫోన్లు చేసి తమకు కూడా చంద్రుడు కనిపించలేదని కమిటీకి తెలిపారు.

ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్న తరువాత కమిటీ అధ్యక్షుడు ఖుబూల్‌ పాషా షుత్తారీ, సభ్యుడు ముఫ్తీఖలీల్ అహ్మద్ మీడియాతో మా ట్లాడుతూ.. రంజాన్ పండుగ జూన్ 16న జరుగుతుందని అధికారికంగా ప్రకటించారు. షవ్వాల్ చంద్రుడు కనిపించనందున శుక్రవారం (జూన్-15) ముస్లింలు యథావిధిగా తమ 30వ ఉపవాసదీక్షను పాటించాలని తెలిపారు. ఈ సమావేశం అనంతరం వక్ఫ్‌బోర్డు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు.

సౌదీఅరేబియా, దుబాయ్ తదితర గల్ఫ్‌దేశాల్లో శుక్రవారం 15వ తేదీ రంజాన్ పండుగ జరుపుకోవాలని ఆ దేశాల్లో అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ లో కనిపినించినట్టు చెప్తున్న చంద్రవంక ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది.  ఆస్ట్రేలియాలో ఈ నెల 16నే రంజాన్ పండుగ జరుగుతుందని మూన్‌ సైటింగ్ ఆస్ట్రేలియా కో-ఆర్డినేటర్ డాక్టర్ షబ్బీర్ అహ్మద్ తెలిపారు.  పండుగ శనివారం కావడంతో షాపింగ్ చేసుకోవడానికి ముస్లింలకు మరోరోజు లభించింది. గురువారం అర్ధరాత్రి దాటాక  నగరంలో మార్కెట్లు జనంరద్దీతో కిటకిటలాడాయి.

 

Posted in Uncategorized

Latest Updates