కనిపిస్తే చెప్పండి : ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్

missing
హైదరాబాద్ నారాయణగూడలోని ఓ కాలేజీలో చదువుతున్న చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యమయ్యారు. నారాయణగూడలోని రాజాబహూదూర్ వెంకటరామిరెడ్డి కాలేజీలో సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామానికి చెందిన చామంతి (18 ఏళ్లు) డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ అదే కాలేజీ హాస్టల్ లో ఉంటుంది. మరో విద్యార్థిని దివ్య(20) సికింద్రాబాద్ కార్ఖన లో నివాసం ఉంటూ ఇదే కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతుంది. చామంతి ఈ నెల 5న అదృశ్యం కాగా… 8న రెడ్డి కాలేజీ యాజమాన్యం నారాయణగూడ పోలీసులు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మరో విద్యార్థి దివ్య ఈ నెల 9న అదృశ్యం కాగా… 10న యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు విద్యార్థినిల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates