కనిపెట్టింది జగిత్యాలలో : హెల్మెట్ లేకపోతే బైక్ స్టార్ట్ కాదు

bikeబైక్ స్టార్ట్ చేయాలంటే తాళం అవసరం. హెల్మెట్ పెట్టుకోవాలంటే తలకాయ ఉండాలి. వేటికి అదే సపరేట్. ఇక నుంచి అలాకాదు అంటున్నారు జగిత్యాల టీచర్. బైక్ స్టార్ట్ కావాలంటే తాళంతోపాటు.. మస్ట్ గా హెల్మెట్ కూడా ఉండాల్సిందే అంటున్నారు. హెల్మెట్ పెట్టుకోకుండా బండిని నడిపించలేరు. ప్రమాదాల నివారణకు, హెల్మెట్ ఆవశ్యకతపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రయోగం బాగుంది అంటున్నారు జగిత్యాల ఎస్పీ అనంతశర్మ.

హెల్మెట్ – బైక్ కు లింక్ ఏంటీ ?

ఇన్ఫ్రారెడ్, రిసీవర్, యాంటెన్నా సాయంతో రెండు సర్క్యూట్‌లను తయారు చేశారు. ఒకటి బైక్ ఇంజిన్‌కు, మరొకటి హెల్మెట్‌కు అమర్చారు. హెల్మెట్ ధరించినప్పుడు అందులోని సర్క్యూట్ తలకు తగిలి.. ఇన్‌ఫ్రా రెడ్ ద్వారా సిగ్నల్స్ వస్తాయి. ఆ సిగ్నల్స్‌ను ఇంజిన్‌కు అమర్చిన యాంటెన్నా గ్రహించి సర్క్యూట్‌కు పంపుతుంది. అప్పుడు పవర్ బటన్ నొక్కగానే బైక్ స్టార్ట్ అవుతుంది. హెల్మెట్ లేకుండా ప్రయత్నిస్తే బైక్ స్టార్ట్ కాదు. దీంతో ఎవరైనా సరే ఇలాంటి బైక్ నడపాలి అంటే మస్ట్ గా హెల్మెట్ పెట్టుకోవాల్సింది. ఈ టెక్నాలజీని తయారు చేసింది జగిత్యాలకి చెందిన ప్రైవేట్ టీచర్ వెంకటసాయి. హెల్మెట్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ.. ఈ హెల్మెట్ ధరించి స్వయంగా బైక్ నడిపారు.

 

Posted in Uncategorized

Latest Updates