కన్నడ రాజకీయం : మంత్రివర్గ కూర్పు పూర్తైంది…అసంతృప్తుల పర్వం మొదలైంది

karకర్నాటకలో కుమారస్వామి మంత్రివర్గ కూర్పు పూర్తైంది. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన 25 మంది మంత్రులకు శాఖల కేటాయింపులు జరిగిపోయాయి. కీలక శాఖలు దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నారు కొందరు మంత్రులు. మరోవైపు అసంతృప్తులను బుజ్జగించేందుకు రొటేషన్ అండ్ రీప్లేస్ ప్లాన్ రెడీ చేసింది కాంగ్రెస్. పనితీరు సరిగా లేని మంత్రులను మార్చేందుకు ఆరు నెలల గడువిచ్చింది. పనితీరు బాగున్నా రెండేళ్లకోసారి మార్చే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అసంతృప్తులను బుజ్జగించేందుకే R అండ్ R ఫార్ములాను కాంగ్రెస్ తెరపైకి తెచ్చిందన్న వాదన వినిపిస్తోంది. పోర్ట్ ఫోలియోలు ఫైనల్ కావడంతో కొంతమంది కాంగ్రెస్ సీనియర్లు అసంతృప్తి చెందారని తెలుస్తోంది. సిద్ధరామయ్య సర్కారులో హోం మినిస్ట్రీ చేసిన రామలింగారెడ్డితో పాటు సీనియర్లు HK పాటిల్, రోషన్ బేగ్ కు మంత్రి పదవులు దక్కలేదు. దాంతో ఆ వర్గం అసంతృప్తితో ఉందన్న వాదనలు వినిపిస్తోంది. రామలింగారెడ్డి బీజేపీని అప్రోచ్ అయ్యారన్న ప్రచారమూ జరిగింది. ఆ ఆరోపణలు ఖండించారు రామలింగారెడ్డి. హైకమాండ్ నిర్ణయంతో పదవులు దక్కిన మంత్రులకూ టెన్షన్ తప్పట్లేదు. మరోవైపు విద్యుత్ శాఖ కోసం డీకే శివకుమార్, రేవణ్ణ మధ్య పోటీ ఏర్పడింది. దాంతో ఆ శాఖను ఎవరికీ కేటాయించకుండా చాకచక్యంగా వ్యవహరించారు కుమారస్వామి. కుమారస్వామి కేబినెట్ కు గవర్నర్ వాజూభాయ్ వాలా ఆమోదముద్ర వేశారు.

Posted in Uncategorized

Latest Updates