కన్నులపండువగా శ్రీరామ శోభాయాత్ర

sree-rama-navami-shobayatraశ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో శ్రీరామ శోభాయాత్ర కన్నులపండువగా జరిగింది. సీతారాంబాగ్, రాణి అవంతిబాయ్ ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన కాళీ మాహరాజ్ స్వామిజీ శోభాయాత్రను ప్రారంభించారు. హనుమాన్ గౌలిగూడ రామమందిరం వరకు శోభాయాత్ర కొనసాగింది.

అస్సాం టూర్ లో బిజీగా ఉన్నారు బీజేపీ చీప్ అమిత్ షా. గౌహతీలో నవరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహారాష్ట్రలోనూ శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేందరమంత్రి నితిన్ గడ్కరి… నాగ్ పూర్ లోని పొద్దారేశ్వర్ ఆలయంలో.. ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత శోభాయాత్రను ప్రారంభించారు. ముంబైలోని సిద్ధివినాయక ఆలయంలో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ప్రత్యేక పూజలు చేసింది.

ఉత్తరప్రదేశ్ లో పెద్ద సంఖ్యలో ప్రజలు శోభాయాత్రలో పాల్గొన్నారు. ఫిరోజాబాద్ లో యువకులు తల్వార్ లతో విన్యాసాలు చేశారు. దేశవ్యాప్తంగా.. శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వారణాసిలోని అష్టభుజి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

శ్రీరామనవమి సందర్భంగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కన్యా ఉత్సవ్ నిర్వహించారు. చిన్నారులకు స్వయంగా స్వీట్లు తినిపించారు. ఆడపిల్లలు దేవతలతో సమానమని.. వాళ్లను ఆదరిస్తే దేవుళ్లను కొలిచినట్టేనన్నారు చౌహన్.

శ్రీరామనవమి సందర్భంగా వెస్ట్ బెంగాల్ లో రామమందిర్ మహోత్సవ్ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. యువకులు జాతీయ పతాకం పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. భారతీయులంతా ఒక్కటేననే నినాదంతోనే తాము శోభాయాత్ర చేస్తున్నామన్నారు నిర్వాహకులు.

వెస్ట్ బెంగాల్ లోని పురులియాలో శోభాయాత్రలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులకు స్థానికులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో కొందరు పోలీసులకు గాయాలయ్యాయి.

Posted in Uncategorized

Latest Updates