కన్నుల పండువగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం


హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం కన్నుల పండువగా జరిగింది. కల్యాణం చూసేందుకు సిటీ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.  రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్ హాజరయ్యారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభతో పాటు కుటుంబ సభ్యులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది దేవస్థానం. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి బల్కంపేటలో ట్రాఫిక్ మళ్లిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates