కమనీయం లక్ష్మీనరసింహుడి కల్యాణం

indrakaranజగిత్యాల జిల్లా ధర్మపురిలో లక్ష్మీ నృసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం (ఫిబ్రవరి-27) యోగ, ఉగ్ర లక్ష్మీనృసింహస్వామి, వెంకటేశ్వర స్వామివారల కల్యాణ మహోత్సవం కనుల పండువలా నిర్వహించారు. ముగ్గురుమూర్తులను ప్రధాన ఆలయాల నుంచి ప్రత్యేక పల్లకిపై వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణలు, బాజాభజంత్రీలతో దేవస్థాన ప్రాంగణంలో అందంగా అలంకరించిన శేషప్ప కళా వేదికపైకి తీసుకొచ్చి ఆసీనులను చేశారు. అశేష భక్త జనం గోవిందనామ స్మరణ చేస్తూ తిలకిస్తుండంగా, వేద బ్రాహ్మణులు రమేశ్‌శర్మ, వంశీశర్మ, దిలీప్‌శర్మ, నటరాజ్‌శర్మ మంత్రాలు, మంగళాష్టకాలు చదువుతుండగా పురోహితులు పురుషోత్తమాచారి ఆధ్వర్యంలో అర్చకులు శ్రీనివాసచారి, మూర్తి, నేరెళ్ల శ్రీనివాసాచారి స్వామివారల కల్యాణోత్సవాన్ని నయనానందకరంగా జరిపారు. స్వామివారికి వెంగలాపూర్, చిల్వకోడూర్, రాజారం తదితర గ్రామాల నుంచి భక్తులు తలంబ్రాలు తీసుకొచ్చారు. బాచంపెల్లి సంతోష్‌శాస్త్రి వాఖ్యానం చేశారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ దంపతులు, జగిత్యాల కలెక్టర్ శరత్ పట్టు వస్ర్తాలు సమర్పించారు.

Posted in Uncategorized

Latest Updates