కమల్ కు KTR ఆల్ ద బెస్ట్ : రాజకీయాల్లో నాయక్ కావాలి

kamal-ktrకమల్ హాసన్ పార్టీని ప్రకటించబోతున్న క్రమంలో తన రాజ‌కీయ అరంగేట్ర కార్య‌క్ర‌మానికి కొంత మంది ప్ర‌ముఖుల‌ను క‌మ‌ల్ ఆహ్వానించారు. సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌ను ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. తెలంగాణ మంత్రి కేటీయార్‌ను కూడా క‌మ‌ల్ ఆహ్వానించారు. అయితే అక్క‌డ‌కు వెళ్ల‌లేకపోయిన కేటీఆర్‌.. ట్విట‌ర్ ద్వారా త‌న అభినంద‌న‌ల‌ను తెలియ‌జేశారు. మ‌ధురైలో ఈ రోజు జ‌రుగ‌నున్న మీ రాజ‌కీయ అరంగేట్ర కార్య‌క్ర‌మానికి న‌న్ను ఆహ్వానించినందుకు మీకు ధ‌న్య‌వాదాలు. కొన్ని కార‌ణాల వ‌ల్ల అక్క‌డ‌కు రాలేక‌పోతున్నాను. నిజజీవితంలోనూ నాయకన్‌ గా మీరు బాగా రాణించాలని కోరుకుంటున్నాను. ఈ కొత్త ఇన్నింగ్స్‌లోనూ మీరు రాణించాల‌ని కోరుకుంటున్నానని కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్విట్ కు రిప్లై ఇచ్చారు కమల్. ధ‌న్య‌వాదాలు కేటీయార్‌గారు. మిమ‌ల్ని మిస్ అవుతున్నాం. భ‌విష్య‌త్తులో మేం నిర్వ‌హించే చాలా కార్య‌క్ర‌మాల‌కు మీరు హాజ‌రుకావాల్సి ఉంటుంది. మీ బిజీ షెడ్యూల్‌లో మాకూ కొంత స‌మ‌యం కేటాయించండి అని క‌మ‌ల్ ట్వీట్ చేశారు.

బుధవారం (ఫిబ్రవరి-21) సాయంత్రం మధురై బహిరంగ సభలో కమల్ పార్టీ పేరు..జెండాను ఆవిష్కరించనున్న విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates