కమల్ నాథ్ కేబినెట్ లో 20మందికి స్థానం

మంత్రివర్గం ఏర్పాటు చేశారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్. 20మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఈ నెల 17న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన  కమల్ నాథ్ మంత్రివర్గం ఏర్పాటు చేయలేదు. వారం రోజుల తర్వాత ఇప్పుడు కేబినెట్ సమకూర్చుకున్నారు. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గం కూర్పు చేశారు. రాజధాని భోపాల్ లో కొత్తమంత్రులతో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కొడుకు జైవర్ధన్ సింగ్, పార్టీ యువనేత జ్యోతిరాధిత్య సింధియాకు కీలక అనుచరుడైన మహేంద్ర సింగ్ సిసోడియాలకు మంత్రివర్గంలో స్థానం దక్కింది. విజయ లక్ష్మీ సాథో, సజ్జన్ సింగ్ వర్మ, హుకుమ్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates