కమల్ పార్టీ :మక్కల్ నీతి మయ్యం

kamal-party-logoవేలాది మంది అభిమానులు, మద్దతుదారుల సమక్షంలో సినీ నటుడు కమల్ హాసన్ పార్టీ పేరును ప్రకటించారు. బుధవారం (ఫిబ్రవరి-21) మధురైలోని ఒత్తకడై గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పార్టీ పేరును మక్కల్ నీతి మయ్యం (సెంటర్ ఫర్ పీపుల్స్ జస్టి) గా ప్రకటించారు. అనంతరం కమల్‌హాసన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్ మాట్లాడుతూ.. తాను ప్రజలకు సలహాలు చెప్పే నాయకుడిని కాదని..ప్రజల నుంచి సలహాలు తీసుకునే వ్యక్తిని అన్నారు. ఈ ఒక్కరోజుతోనే కార్యక్రమం ఆగిపోదు. నేడు నాయకుడిని కాదు. మీలో ఒకడిని అన్నారు. మీకు సేవ చేసేలా మాకు మార్గనిర్దేశం చేయాలని కమల్‌హాసన్ తన అభిమానులు, కార్యకర్తలను కోరారు. ఈ సభకు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమిళ తల్లి పాటతో సభ ప్రారంభమైంది.

Posted in Uncategorized

Latest Updates