కమింగ్ సూన్ : క్రికెట్ దేవుళ్ల సరసన కోహ్లీ

DWd1EPdWAAEcEk5సౌతాఫ్రికా గడ్డపై రికార్డులపై రికార్డులు కొల్లగొడుతూ దూసుకెళ్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ఇప్పుడు మరో రికార్డు ఊరిస్తున్నది. క్రికెట్ చరిత్రలో ఆ రికార్డు ఇప్పటి వరకు ఇద్దరి పేరుపై ఉంది. ఆ ఇద్దరు బ్రాడ్ మెన్, వివ్ రిచర్డ్స్. ఇంతకీ వారి పేరుపై ఉన్న రికార్డ్ ఏంటో తెలుసా.. విదేశీ గడ్డపై.. ఒకే టూర్ లో వెయ్యి పరుగులు సాధించటం. మరి విరాట్ కోహ్లీ వారికి ఎంత దూరంలో ఉన్నాడు అంటే.. కేవలం 130 పరుగుల దూరంలో ఉన్నాడు. కోహ్లీ రికార్డ్ విషయానికి వెళితే..

1976లో ఇంగ్లండ్‌ టూర్‌లో రిచర్డ్స్ 1045 రన్స్ చేశాడు. నాలుగు టెస్టుల్లో 829 పరుగులు, వన్డేల్లో 216 పరుగులు చేశాడు. ప్రస్తుతం కోహ్లి సౌతాఫ్రికా టూర్‌లో ఇప్పటివరకు 870 పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.  టెస్టుల్లో 3, వన్డేల్లో ఒక సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 13 ఇన్నింగ్స్‌లో 87 సగటుతో కోహ్లి 870 రన్స్ చేయడం విశేషం. కోహ్లి మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 286 రన్స్ చేయగా.. 6 వన్డేల్లో 558 రన్స్ చేశాడు. ఫస్ట్ టీ20లో 26 పరుగలు చేసి ఔటయ్యాడు.

అయితే మరో రెండు టీ20లు మాత్రమే మిగిలున్న సౌతాఫ్రికా టూర్‌లో విరాట్ మరో 130 పరుగులు చేయగలడా అన్నది డౌటే. ఇక రెండోస్థానంలో డాన్ బ్రాడ్‌మన్ ఉన్నాడు. బ్రాడ్‌మన్ కూడా ఇంగ్లండ్ టూర్‌లోనే ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 974 రన్స్ చేశాడు. ఇప్పుడీ రికార్డు బ్రేక్ చేయాలన్నా.. విరాట్ మరో 104 పరుగుల దూరంలో ఉన్నాడు.

130 పరుగులు చేసి రిచర్ట్స్, బ్రాడ్ మెన్ రికార్డ్స్ ను బ్రేక్ చేయలేకపోయినా.. 104 రన్స్ చేసి వాల్డ్ నెంబర్ టూ ప్లేస్ లో అయినా నిలుస్తాడని భావిస్తున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం కోహ్లీ దూకుడుగా ఉన్నాడని.. రెండు మ్యాచ్ ల్లో ఈ రికార్డ్ బ్రేక్ చేయటం కష్టం కాకపోవచ్చని భావిస్తున్నారు.  రెండో టీ20 బుధవారం (ఫిబ్రవరి-21)న జరగనున్న విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates